సిద్దిపేట జిల్లాలో వాహన తనిఖీలు .. 66 డ్రంకన్ ​డ్రైవ్ ​కేసులు నమోదు

సిద్దిపేట జిల్లాలో వాహన తనిఖీలు .. 66 డ్రంకన్ ​డ్రైవ్ ​కేసులు నమోదు

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం సాయంత్రం సర్​ప్రైజ్ వాహన తనిఖీలు నిర్వహించినట్లు సీపీ అనురాధ తెలిపారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా 66 డ్రంకన్​డ్రైవ్​కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై  289 కేసులు నమోదుచేశామన్నారు. 

సీపీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు, డ్రగ్స్ అక్రమ రవాణా నివారించడం కోసం జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. యువత సైబర్ నేరానికి గురైతే గంటలోపు 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న మొత్తాన్ని తిరిగి రాబట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.