హైదరాబాద్ జీడిమెట్లలో ఫుల్లుగా లిక్కర్ తాగి వ్యక్తి మృతి

హైదరాబాద్ జీడిమెట్లలో ఫుల్లుగా లిక్కర్ తాగి వ్యక్తి మృతి

జీడిమెట్ల, వెలుగు: అధిక మోతాదులో మద్యం సేవించిన ఓ వ్యక్తి మృతిచెందాడు. రాజస్థాన్​కు చెందిన అనీల్​కుమార్​(30) బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి గుండ్లపోచంపల్లిలో ఉంటూ లేబర్​ పని చేస్తున్నాడు. ఇతడికి ఆరోగ్య సమస్యలు ఉండటంతో మద్యానికి దూరంగా ఉండాలని డాక్టర్లు సూచించారు. 

న్యూఇయర్​ వేడుకల సందర్భంగా గురువారం రాత్రి బిల్డింగ్​ టెర్సస్​ పై అతిగా మద్యం సేవించాడు. అపస్మారక స్థితికి వెళ్లి కింద పడిపోయాడు. రూమ్​మేట్స్​ అతడిని వెంటనే దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. పేట్​ బషీరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.