లోన్ యాప్ వేధింపులకు బలవుతున్న అమాయకులు సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. లోన్ యాప్స్ నిర్వాహకుల బెదిరింపులకు బయపడొద్దని పోలీసులు అవహగాహన కల్పిస్తున్నప్పటికీ జనంలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. జగిత్యాలలో మరో యువకుడు లోన్ యాప్ వేధింపులతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన అక్కినపల్లి లిఖిత్ కొంతకాలం క్రితం లోన్ యాప్స్ ద్వారా డబ్బులు తీసుకున్నాడు. ఆ తర్వాత లోన్ వసూలు పేరుతో యాప్ నిర్వాహకులు తీవ్రంగా వేధించడంతో మనస్తాపానికి గురైన లిఖిత్... కొద్దిరోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు.
ALSO READ : కేటీఆర్ యువతను నాశనం చేయాలని చూస్తున్నాడు
కుటుంబసభ్యులు లిఖిత్ ను వెంటనే ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు లిఖిత్. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
