ఒక్క అమ్మాయే దొరకడంలేదు..నీకు ఇంత మంది ఎలా

ఒక్క అమ్మాయే దొరకడంలేదు..నీకు ఇంత మంది ఎలా

అప్పట్లో కొందరు రాజులు లెక్కలేనంత మందిని పెండ్లి చేసుకునేవాళ్లని విన్నాం. కానీ..   ఇప్పుడు ఒక అబ్బాయికి ఒక అమ్మాయి దొరకడమే కష్టంగా మారింది. అలాంటిది ఈయన ఏకంగా 37వ సారి పెండ్లి చేసుకుని వైరల్ అయ్యాడు. ఆ వీడియోని ఐపిఎస్ ఆఫీసర్‌‌‌‌ రూపిన్ శర్మ సోషల్‌‌మీడియాలో షేర్ చేశాడు. దుబాయికి చెందిన ఒక వ్యక్తి ఏకంగా 37వ సారి పెండ్లి చేసుకున్నాడు. అది కూడా తన 28 మంది భార్యలు ముందు. మామూలుగా భార్య ముందు భర్త వేరే అమ్మాయిని కన్నెత్తి చూసినా ఊరుకోదు. అలాంటిది 28 మంది భార్యలు చూస్తుండగానే మరో వ్యక్తిని పెండ్లి చేసుకున్నాడు ఈ పెద్దాయన. అంతేకాదు ఈ పెండ్లికి తన భార్యలతోపాటు 135 మంది పిల్లలు, 126 మంది మనవళ్లు, మనవరాళ్లు వెళ్లారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌‌ మీడియాలో ఫుల్‌‌ వైరల్‌‌ అయింది. ‘‘ఒక్క అమ్మాయే దొరకడంలేదు. నీకు ఇంత మంది ఎలా దొరికార’’ని ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

ఇలాంటి వింత రికార్డే ఇంకోటి ఉంది. ఒకతను ఒకే అమ్మాయిని నాలుగుసార్లు పెండ్లి చేసుకున్నాడు. తైవాన్‌‌కి చెందిన ఒక వ్యక్తి 37 రోజుల్లో ఒకే మహిళను నాలుగుసార్లు పెండ్లి చేసుకున్నాడు. ఆమె నుంచి మూడుసార్లు విడాకులు తీసుకున్నాడు. ఇదంతా చేసింది ఆఫీస్‌‌లో సెలవుల కోసమే. అతను ఒక బ్యాంక్‌‌ ఉద్యోగి. కిందటేడాది ఏప్రిల్ 6న అతని పెండ్లి జరిగింది. పెండ్లి కోసం ఇచ్చిన సెలవులు అయిపోగానే.. భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నా అని మళ్లీ సెలవు పెట్టాడు. అధికారికంగా విడాకులు కూడా తీసుకున్నాడు. వెంటనే అదే అమ్మాయిని మళ్లీ పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పి లీవ్‌‌ పెట్టాడు. ఇలా మూడు సార్లు లీవ్‌‌ పెట్టి, నాలుగు సార్లు పెళ్లి చేసుకుని మొత్తానికి 37 రోజులు లీవ్‌‌లో ఉన్నాడు.

 

మరిన్ని వార్తల కోసం

‘సైకిల్’కు మళ్లీ పెరుగుతున్న క్రేజ్