ఉప్పల్ స్కైవాక్ లిఫ్ట్లో ఇరుక్కున్న యువకుడు.. రెండు గంటలపాటు నరకయాతన

ఉప్పల్ స్కైవాక్ లిఫ్ట్లో ఇరుక్కున్న యువకుడు.. రెండు గంటలపాటు నరకయాతన

ఉప్పల్, వెలుగు: ఉప్పల్​లోని స్కైవాక్​ లిఫ్ట్ లో ఓ యువకుడు ఇరుక్కొని రెండు గంటల పాటు నరకయాతన అనుభవించాడు. ఉప్పల్​కు చెందిన రాహుల్(20) ఎన్ఆర్బీ ప్రైవేట్​ కంపెనీలో డ్యూటీ చేస్తున్నాడు. గురువారం రాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లే క్రమంలో స్కైవాక్​ 6-బి లిఫ్ట్​ ఎక్కగా మధ్యలో ఆగిపోయి, డోర్​ ఓపెన్​ కాక చిక్కుకున్నాడు. 

ఎమర్జెన్సీకి డయల్​ చేయగా లోకల్​ పోలీసులు, హైడ్రా అధికారులు, ఫైర్​ సిబ్బంది లిఫ్ట్​ డోర్​ తెరిచేందుకు రెండు గంటల పాటు శ్రమించినా ఫలితం లేకపోవడంతో టెక్నీషియన్లను రప్పించారు. ఎట్టకేలకు బాధితుడిని సురక్షితంగా బయటకు తీశారు. లిఫ్ట్​లో ఊపిరాడక ఇబ్బంది పడ్డానని, తాను బతుకుతానో లేదోనని భయాందోళనకు గురయ్యానని బాధితుడు వాపోయాడు.