హోండా క్యూసీ3 వచ్చేసింది.. ఒక్కో చార్జ్‎తో 145 కిలోమీటర్ల మైలేజ్  

హోండా క్యూసీ3  వచ్చేసింది.. ఒక్కో చార్జ్‎తో 145 కిలోమీటర్ల మైలేజ్  

హోండా క్యూసీ3 ఫ్యామిలీ ఈ–స్కూటర్‎ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ) ధర రూ. 1.35 లక్షలు. ఇందులోని మూడు కిలోవాట్ల బ్యాటరీని చార్జ్​చేస్తే 145 కి.మీ. మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. దీని బ్యాటరీ 80 శాతం కావడానికి 2. 40 గంటలు, పూర్తి చార్జ్‌‌‌‌కు సుమారు 4 గంటలు పడుతుంది.  32 లీటర్ల భారీ అండర్-సీట్ స్టోరేజ్, రోడ్‌‌‌‌ సింక్ కనెక్టివిటీ, టర్న్- బై -టర్న్ నావిగేషన్‌‌‌‌తో కూడిన 5-అంగుళాల డిస్‌‌‌‌ప్లే, స్మార్ట్ కీ టెక్నాలజీ క్యూసీ3 ప్రత్యేకతలు.