V6 News

ఆస్కార్‌కు అర్హత సాధించిన మొదటి తెలుగు షార్ట్ ఫిల్మ్

ఆస్కార్‌కు అర్హత సాధించిన మొదటి తెలుగు షార్ట్ ఫిల్మ్

మొట్ట మొదటి సారిగా ఆస్కార్‌కు అర్హత సాధించింది  ఓ తెలుగు షార్ట్ ఫిల్మ్. ఈ చిత్రం ఇప్పుడు అకాడమీ సభ్యుల ఓటింగ్‌ కోసం ప్రదర్శితవుతోంది.  దీపక్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ షార్ట్‌ ఫిల్మ్‌ 2020లో విడుదలైంది. అప్పటి నుండి 950 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. 300 అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. ఆస్కార్‌ కోసం పోటీ పడుతున్న సినిమాల్లో మనసానమ  ఉండడం సంతోషంగా ఉందన్నారు  సినిమా మేకర్స్.