ప్రభుత్వ స్కూల్లో చదివిస్తే ఇంటి పన్నులు చెల్లిస్తా : మంగ్లూర్ సర్పంచ్

ప్రభుత్వ స్కూల్లో చదివిస్తే ఇంటి పన్నులు చెల్లిస్తా : మంగ్లూర్ సర్పంచ్

నిజాంసాగర్(ఎల్లారెడ్డి)​, వెలుగు: తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చదివించాలని, అలా చదివిస్తే పన్నులను తానే చెల్లిస్తానని కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ​మండలం మంగ్లూర్​ సర్పంచ్​ ప్రకటించారు. స్థానిక ప్రైమరీ స్కూల్​లో ఈ ఏడాది పిల్లలను చేర్పిస్తే వారి ఇంటి పన్నులు, నీటి పన్నులు తానే చెల్లించనున్నట్లు గ్రామ సర్పంచ్ ​రాజు తెలిపారు.  

స్కూల్​లో విద్యార్థుల సంఖ్య తగ్గకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. గురువారం నలుగురు విద్యార్థులు చేరగా వారి ఇంటి పన్నులు చెల్లించనున్నట్లు తెలిపారు.