రంజాన్ మాసంలో వచ్చే షబ్ -ఏ - ఖదర్ సందర్భంగా హైదరాబాద్ లోని పలు ఫ్లైఓవర్లను మంగళవారం (ఏప్రిల్ 18) రాత్రి 10 గంటల నుంచి మూసివేయనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లోని గ్రీన్ ల్యాండ్ ఫ్లైఓవర్, పీఎన్ వీఆర్ ఎక్స్ ప్రెస్ వే, లంగర్ హౌజ్ ఫ్లై ఓవర్లు మినహా మిగతా అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు. మరోవైపు నెక్లెస్ రోడ్డును కూడా మూసివేయనున్నారని ట్రాఫిక్ పోలీసు అధికారులు వెల్లడించారు.
ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో వచ్చే షబ్ -ఏ - ఖదర్‌కు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఈ వేడుకలను ముస్లిం సోదరులు వేడుకగా నిర్వహించుకుంటారు. ప్రత్యేకంగా ఇఫ్తార్ విందులను ఏర్పాటు చేసుకుంటారు.
రంజాన్ మాసంలోని చివరి పది రోజుల్లో నిర్వహించే ఐదు తాఖ్‌రాత్రుల్లో ఏదో ఒకరోజును షబ్ -ఏ -ఖదర్‌గా నిర్ణయిస్తారు. షబ్ అంటే రాత్రి, ఖదర్ అంటే గౌరవించడం అనే అర్థం.
