నిన్న లైవ్ లో.. నేడు మాల్ లో.. అబ్బాయిలు ఇలా చెప్తే నో ఎలా చెప్తాం

నిన్న లైవ్ లో.. నేడు మాల్ లో.. అబ్బాయిలు ఇలా చెప్తే నో ఎలా చెప్తాం

పెళ్లి లేదా లవ్ ప్రపోజల్ అనేది జీవితంలో మధురమైన, మర్చిపోలేని క్షణాలనిస్తుంది. అలాంటి ఈ ప్రక్రియను కొందరు 10వేల అడుగుల ఎత్తులో ఉండి చెప్పడం, సముద్రపు లోతున చెప్పడం వంటి వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేశారు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఓ వీడియో ఇప్పుడు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఓ వ్యక్తి మాల్‌లో తన ప్రియురాలికి ప్రపోజ్ చేస్తున్న ఈ వీడియో విపరీతంగా ఆకర్షిస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ప్రియాంషి పోస్ట్ చేసిన ఈ వీడియో హృదయపూర్వక దృశ్యాన్ని ప్రదర్శించింది. ఈ క్లిప్‌లో, ఒక వ్యక్తి తన స్నేహితురాలిని ఎంతో చాకచక్యంగా ప్రవర్తించి.. ప్రియురాలిని చేసుకున్నాడు. ఆమె తన స్నేహితులతో మాల్ లో నడుస్తుండగా.. వెనుక నుంచి వచ్చిన ఆ యువకుడు సర్ఫ్రైజ్ చేశాడు. వారు వెనక్కి తిరిగి చూడగా.. అతను ఆ అమ్మాయి ముందు మోకాళ్లపై మోకరిల్లి, చేతిలో ఉంగరాన్ని పట్టుకుని కనిపించాడు. ఈ సమయంలో ఆశ్చర్యంతో పాటు ఆనందం కలగలిసి వెలిగిపోతున్న ఆమె ముఖాన్ని చూసి అక్కడున్న వారంతా ఆసక్తిగా చూడసాగారు. ఆ తర్వాత ఆమె మెల్లగా అతని వైపుకు అడుగులు వేసింది. అలా ఆ వ్యక్తి.. ఆమె వేలికి ఉంగరాన్ని పెట్టాడు. ఆ తర్వాత వారిద్దరూ కౌగిలించుకున్నారు. ఇది చూపరులను ఎంతగానో ఆకర్షించింది. ఈ పోస్ట్ తో పాటు “ప్రతి అమ్మాయి ఈ రకమైన ప్రపోజల్ కు అర్హురాలు” అని వీడియోకు శీర్షికగా పెట్టారు.

ఈ వీడియో ఆగస్టు 17న షేర్ చేశారు. అప్పట్నుంచి దీనికి 9.9మిలియన్లకు పైగా వ్యూస్, అనేక కామెంట్లు వచ్చాయి. నేను దీన్ని పదిసార్లు చూశాను, వారు చాలా అందంగా ఉన్నారు, ఇది భారతదేశంలో... ఇప్పుడు అమ్మాయిలపై అంచనాలను పెంచుతోంది" అని ఒక యూజర్ రాసుకురాగా.. “ఓ మై గాడ్ నేను ఆమె అయితే, నేను అతనికి ఎదురుగా కూర్చుని అతనిని చాలా గట్టిగా కౌగిలించుకుంటాను అని మరొకరు రిప్లై ఇచ్చారు. వారిద్దర్నీ గమనించి అమ్మాయిలు స్నేహితులు పక్కకు తప్పుకోవడం నిజంగా చాలా బాగుంది అని ఇంకొకరు అన్నారు.