మావోయిస్టుల డంప్‌‌‌‌‌‌‌‌ స్వాధీనం

మావోయిస్టుల డంప్‌‌‌‌‌‌‌‌ స్వాధీనం

భద్రాచలం, వెలుగు: మావోయిస్టులకు సంబంధించిన డంప్‌‌‌‌‌‌‌‌ను ఆదివారం భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఛత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ రాష్ట్రంలోని నారాయణ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ జిల్లా కోయిలీబేడా, చోటేబేటియా పోలీస్​స్టేషన్ల పరిధిలో పోలీసులు, డీఆర్జీ, బీఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌, బీడీఎస్‌‌‌‌‌‌‌‌ టీంలు ఆదివారం సంయుక్తంగా కూంబింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. 

ఈ క్రమంలో రెండు చోట్ల డంప్‌‌‌‌‌‌‌‌ను గుర్తించారు. డంప్‌‌‌‌‌‌‌‌లో కంట్రీమేడ్‌‌‌‌‌‌‌‌ బీజీఎల్‌‌‌‌‌‌‌‌ లాంచర్లు, 12 బోర్‌‌‌‌‌‌‌‌ రైఫిల్‌‌‌‌‌‌‌‌, బీజీఎల్‌‌‌‌‌‌‌‌ సెల్స్‌‌‌‌‌‌‌‌, ఎలక్ట్రిక్​, నాన్‌‌‌‌‌‌‌‌ ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ డిటోనేటర్లు, గన్‌‌‌‌‌‌‌‌పౌడర్‌‌‌‌‌‌‌‌, సీసా బాంబులు, పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు దొరికాయి.