భద్రాచలం, వెలుగు : ఛత్తీస్గఢ్రాష్ట్రం బీజాపూర్జిల్లాలోని అడవుల్లో ఉన్న మావోయిస్టుల డంప్ లను భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. తాడ్పాల్ పోలీస్స్టేషన్ సమీప అడవుల్లో బీజీఎల్తయారీ యంత్రాలకు సంబంధించిన పరికరాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 105 బీజీఎల్లాంఛర్లు, 2 ఐరన్ పైపులు, అల్యూమినియం పాత్రలను గుర్తించారు.
ఇదే జిల్లాలోని మిర్తూర్పోలీస్స్టేషన్పరిధిలో ఇండరీపాల్గుట్టల్లో 2 బీజీఎల్లాంఛర్లు, ఐదు బాణాల బాంబులు, డుమరీపాల్అడవుల్లో ఏడు బండిళ్ల నాన్ఎలక్ట్రిక్వైర్, ఆరు డిటోనేటర్లను డంప్నుంచి వెలికితీశారు. ఈ డంపులను బీజాపూర్ఎస్పీ ఆఫీస్ కు తరలించారు.
