గద్దర్ ఉద్యమ జీవితంపై మావోల లేఖ

గద్దర్ ఉద్యమ జీవితంపై మావోల లేఖ

గద్దర్ మృతిపై మావోయిస్టు పార్టీ సంతాపం ప్రకటించింది. గద్దర్ మృతి మమ్మల్ని కలిచివేసిందని తెలిపింది. జననాట్య మండలి ఏర్పాటులో గద్దర్ కృషి ఉందని పేర్కొంది. నాలుగు దశాబ్దాలు పీడిత ప్రజల పక్షాన గద్దర్ నిలబడ్డారని గుర్తు చేసింది. 1972- 2012 వరకు మావోయిస్టు పార్టీ సభ్యుడిగా ఉన్నారని పేర్కొంది. 80వ దశకంలో నాలుగేళ్ల దళ జీవితం కొనసాగించారని మావోయిస్టు పార్టీ తెలిపింది. తెలంగాణలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాల్లో పాటలు, నాటికలు, బుర్ర కథలు, ఒగ్గు కథల రూపంలో ప్రజలను చైతన్య పరిచారని లేఖలో పేర్కొంది. 

 
మలి దశ ఉద్యమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడిగా గద్దర్ పని చేశాడని మావోయిస్టు పార్టీ పేర్కొంది. దోపిడి పాలకులు ఎన్ కౌంటర్, బూటకపు ఎన్ కౌంటర్లలో మరణించిన విప్లవ కారుల శవాలను తమ కుటుంబాలకు చేరకుండా చేసిన సందర్భంలో.. శవాల స్వాధీన ఉద్యమానికి నాయకత్వం వహించాడని మావోయిస్టు పార్టీ గుర్తు చేసింది.