భద్రాచలం, వెలుగు : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లా రావ్‌ఘాట్ ఏరియా కమిటీకి చెందిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ రూపీ గన్‌మెన్ రామ్‌కో మండావి గురువారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ప్రస్తుతం రూపీ, చంద్రతో పాటు 13 మంది మావోయిస్టులు ఇంకా రావ్‌ఘాట్ ఏరియా కమిటీలో పనిచేస్తున్నారని కాంకేర్ పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
జిల్లాలోని చోటే భేటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని రావ్‌ఘాట్ ఏరియా కమిటీ సభ్యుల కోసం డీఆర్జీ, ఎస్టీఎఫ్, ఐటీబీపీ, సీఆర్‌పీఎఫ్ బలగాలతో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రూపీ గన్‌మెన్ రాంకో మండావి చోటేభేటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచ్‌పల్లి గ్రామ అడవుల్లో భద్రతాబలగాల ఎదుట ఆయుధంతో సహా సరెండర్ అయ్యారు.
