మర్కజ్ కాంటాక్ట్స్ చైన్ బ్రేక్ చేస్తున్నారు

మర్కజ్ కాంటాక్ట్స్ చైన్ బ్రేక్ చేస్తున్నారు
  • కరోనాపై ఫైట్ లో పక్కా ప్రణాళిక
  •  కీలకంగా మారిన ఇంటలిజెన్స్ రిపోర్ట్

కరోనా వైరస్ ను కంట్రోల్ చేసేందుకు పోలీసులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ ఆధారంగా మర్కజ్ రిటర్న్స్, కాంటాక్ట్స్ ను 4 కేటగిరీలుగా డివైడ్ చేసి సెర్చ్ చేస్తున్నారు. మొత్తం1,100 మందికిపైగా ఢిల్లీ మర్కజ్ ప్రారనల్థకు వెళ్లొచ్చినట్లు గుర్తించారు. వారిని, వారి కాంటాక్ట్స్ ను కలిపి దాదాపు 3,158 మందిని క్వారంటైన్ చేశారు. హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఇంటలిజెన్స్ అందించిన సమాచారంతో లిస్ట్ తయారు చేశారు. మర్కజ్ పాజిటివ్ కేసులు, కాంటాక్ట్స్  చైన్ ను గుర్తిస్తున్నారు. పాజిటివ్ కేసులతోపాటు వారి ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్,15 రోజులుగా వాళ్లు కలిసిన వారి డీటెయిల్స్ సేకరిస్తున్నారు. కింగ్ కోఠి, ఓల్డ్ సిటీ తో పాటు పహాడీషరీఫ్ పీఎస్ పరిసరాల్లో స్పెషల్ టీమ్స్ సెర్చ్ చేస్తున్నాయి. గుర్తించిన వారిని వెంటనే క్వారంటైన్ కు తరలిస్తున్నారు. లేదా హోం క్వారంటైన్స్ పాటించాలని సూచిస్తున్నారు..

సిబ్బంది హెల్త్ పై జాగ్రత్తలు

పాజిటివ్ వచ్చిన వారికి గాంధీ, కింగ్ కోఠి, ఫీవర్ ఆస్పత్రుల్లోని ఐసోలేషన్ సెంటర్లలో ట్రీట్ మెంట్ చేస్తున్నారు. హాస్పిటల్ డ్యూటీ తో పాటు  కరోనా సస్పెక్టర్స్ హౌస్ చెకింగ్ లో పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉన్నతాధికారులు గైడ్ లైన్స్ రూపొందించారు. ప్రతి అధికారి మాస్క్,శానిటైజర్ తోపాటు పీపీఈ కిట్స్ తప్పనిసరిగా ధరించేలా ఆదేశాలిచ్చారు. డీసీపీ స్థాయి సీనియర్ అధికారులతో పర్యవేక్షిస్తున్నారు. గ్రౌండ్ లెవల్ సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్త లపై ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు.

అందరి డేటా మా దగ్గరుంది

కరోనా వైరస్ పై వార్ చేస్తునాం. పోలీస్ సిబ్బంది కూడా ప్రికాషన్స్ పాటించాలి. మర్కజ్ వెళ్లి వచ్చిన వారి డేటా మా దగ్గర ఉంది.100 శాతం ట్రేస్ చేశాం. వారి కాంటాక్స్ ట్ను గుర్తిస్తున్నాం. మర్కజ్ చైన్ లో ఉన్న కాంటాక్ట్స్ ఎవరెవరిని కలిశారో చెప్పాలి. కొన్ని ఏరియాల్లో 5 నుంచి 6 కేసులు ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో కి ఇతరులను అనుమతించడం లేదు. ప్రజలంతా లాక్ డౌన్ కి సహకరించాలి.                                  – అంజనీకుమార్, సీపీ,హైదరాబాద్