వికారాబాద్, వెలుగు: అసెంబ్లీ స్పీకర్‌గడ్డం ప్రసాద్‌కుమార్ కృషితో తాండూర్పీఆర్ఈఈ కార్యాలయ పరిధిలో ఉన్న మర్పల్లి పీఆర్సబ్డివిజన్ను వికారాబాద్ఈఈ కార్యాలయ పరిధిలోకి తీసుకువస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వికారాబాద్అసెంబ్లీ పరిధిలో ఉన్న మర్పల్లి పీఆర్సబ్డివిజన్తాండూర్ పీఆర్‌ఈఈ కార్యాలయంలో కొనసాగుతుండేది. దీంతో మర్పల్లి సబ్డివిజన్పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులకు తాండూర్‌కు వెళ్లాల్సి రావడంతో ప్రజా ప్రతినిధులకు, కాంట్రాక్టర్లకు, అధికారులకు అసౌకర్యంగా ఉండేది. అసెంబ్లీ స్పీకర్ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లి, పరిష్కారానికి చొరవ చూపారు.
