ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెట్టింగ్ ఉచ్చులో పడొద్దు.. పోలీసు సిబ్బందికి డీజీపీ సీవీ ఆనంద్ సూచన

ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెట్టింగ్ ఉచ్చులో పడొద్దు.. పోలీసు సిబ్బందికి డీజీపీ సీవీ ఆనంద్ సూచన

హైదరాబాద్, వెలుగు: ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ బెట్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బానిసలై, తీవ్ర అప్పులపాలై పోలీసు సిబ్బంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ఆయన తెలంగాణ పోలీసు శాఖలోని మొత్తం 93,000 మంది సిబ్బందికి ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.

గడిచిన నాలుగు నెలల వ్యవధిలో పోలీసు శాఖకు చెందిన ఇద్దరు యువ సిబ్బంది ఆత్మహత్యలకు పాల్పడడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బలవన్మరణాలపై శాఖాపరంగా నిర్వహించిన అంతర్గత విచారణలో అనేక దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగు చూశాయని డీజీపీ తెలిపారు.

ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ బెట్టింగ్ యాప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విపరీతంగా డబ్బు పోగొట్టుకుని, విపరీతమైన అప్పులపాలవడమే ఈ విషాదాలకు ప్రధాన కారణమని తేలిందని స్పష్టం చేశారు. బాధితుల్లో కొందరు తమకున్న కొద్దిపాటి భూములు అమ్ముకోగా, మరికొందరు తోటి ఉద్యోగులు, స్నేహితుల వద్ద భారీగా అప్పులు చేసి తీర్చలేక మానసిక ఒత్తిడికి గురైనట్లు పేర్కొన్నారు.

జీవితంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, ఆత్మహత్యే ఏ సమస్యకైనా పరిష్కారమని భావించడం సరికాదని డీజీపీ హితవు పలికారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే తమ ఉన్నతాధికారులను సంప్రదించి సలహాలు, పరిష్కారాలు పొందాలని కోరారు. రాష్ట్రంలోని పోలీసు సిబ్బంది అందరూ ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ బెట్టింగ్, ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ గేమింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. కుటుంబం, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ సంయమనంతో వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.