హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన ‘మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్’మెగా షోరూం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. జంట నగరాల్లోనే అతి పెద్దదిగా, అంతర్జాతీయ హంగులతో తీర్చిదిద్దిన ఈ షోరూంను ప్రముఖ సినీ నటుడు, విక్టరీ వెంకటేశ్ ప్రారంభించారు. అనంతరం మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ డైరెక్టర్స్ వెంకట్ మర్రి, వెంకట్ కృష్ణతో కలిసి షోరూంలోని కలెక్షన్లను నటుడు వెంకటేశ్ తిలకించారు.
ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ.. వేలాది సరికొత్త డిజైన్లను ఒకే చోట అందించడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా సామాన్య ప్రజలపై భారం పడకుండా.. ఏడాది పొడవునా అతి తక్కువ తరుగు ధరలకే బంగారం అందించాలన్న యాజమాన్యం ఆలోచన ఎంతో గొప్పదని కొనియాడారు.
బంగారు ఆభరణాలపై 1 నుంచి 11 శాతం వరకు మాత్రమే తరుగు ఉంటుందని, ఈ ప్రత్యేక ఆఫర్ పండుగల సమయానికే పరిమితం కాకుండా వినియోగదారులకు సంవత్సరం పొడవునా అందుబాటులో ఉంచుతున్నట్లు షోరూం నిర్వాహకులు తెలిపారు. షోరూం ప్రారంభోత్సవం, అక్షయ తృతీయ సందర్భంగా తరుగుపై అదనంగా 25 శాతం తగ్గింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, వెండి వస్తువులపై ఎలాంటి తరుగు లేదని, మేకింగ్ చార్జీలు పూర్తిగా రద్దు చేశారని, కిలో వెండిపైన రూ.20 వేల వరకు తగ్గింపు పొందొచ్చని చెప్పారు.
