V6 News

ప్రెసిడెంట్ కప్ ఫైనల్ లో మేరీ కోమ్ కు గోల్డ్ మెడల్

ప్రెసిడెంట్ కప్ ఫైనల్ లో మేరీ కోమ్ కు గోల్డ్ మెడల్

జకార్తా: ఇండోనేషియాలో జరిగిన ప్రెసిడెంట్ కప్ ఫైనల్ లో భారత బాక్సర్ మేరి కోమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.  51 కేజీల విభాగంలో జరిగిన  టోర్నమెంట్ లో  ఆస్ట్రేలియా బాక్సర్‌ ఫ్రాంక్స్‌ ఏప్రిల్‌ను 5-0 తేడాతో ఓడించి మేరి విజయం సాధించింది. బాక్సింగ్‌లో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్‌ ఈ ఏడాది మేలో జరిగిన భారత ఓపెన్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లోనూ గోల్డ్ మెడల్ ను సొంతం చేసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 7నుంచి 21 తేదీల్లో రష్యాలో జరగనున్న ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌-2019లో మేరీకోమ్‌ పాల్గొననుంది.