ఢిల్లీ జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ముసుగులు వేసుకుని వచ్చిన దుండగులు.. JNU స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఆయిషీ ఘోష్ తో పాటు పలు విద్యార్థులపై దాడి చేశారు. ఈ దాడిలో కొందరు అద్యాపకులకు కూడా గాయాలయ్యాయినట్టు తెలుస్తోంది. దుండగుల దాడిలో ఆయిషీ ఘోష్.. తలకు తీవ్ర గాయమైంది. దాడి నేపథ్యంలో JNUకు ఏడు అంబులెన్స్ లు పంపించింది ఢిల్లీ ప్రభుత్వం. మరో 10 అంబులెన్స్ లు సిద్ధంగా ఉంచాలని ఆదేశించింది. అటు.. పోలీసులు కూడా భారీ సంఖ్యలో క్యాంపస్ కు చేరుకున్నారు. JNU గేటు దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు.
JNUలో దాడి ఘటనను ఖండించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. క్యాంపస్ లో శాంతియుత పరిస్థితులు ఏర్పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ ట్వీట్ చేశారు. యూనివర్సిటీ క్యాంపస్ లో కూడా విద్యార్థులకు భద్రత లేకపోతే.. దేశం ఎలా ముందుకెళ్తుందని ప్రశ్నించారు.
#WATCH Delhi: Jawaharlal Nehru University Students' Union president & students attacked by people wearing masks on campus. 'What is this? Who are you? Step back, Who are you trying to threaten?… ABVP go back,' can be heard in video. (note: abusive language) pic.twitter.com/gYqBOmA37c
— ANI (@ANI) January 5, 2020
Jawaharlal Nehru University Student Union (JNUSU) President Aishe Ghosh at JNU: I have been brutally attacked by goons wearing masks. I have been bleeding. I was brutally beaten up. pic.twitter.com/YX9E1zGTcC
— ANI (@ANI) January 5, 2020
