గుజరాత్లో భారీ అగ్ని ప్రమాదం

గుజరాత్లో భారీ అగ్ని ప్రమాదం

గుజరాత్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడి పక్కనున్న మరో మూడు పరిశ్రమలకు వ్యాపించాయి. ఈ ఘటన వస్లాద్ జిల్లాలోని ఉమర్ గామ్ జిఐడిసి ప్రాంతంలో 2023, నవంబర్ 19వ తేదీ ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది హుటాహుటినా సంఘనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

 ఐదు ఫైరింజన్లతో సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటన ఎలా జరిగిందనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.