V6 News

గేటెడ్ కమ్యూనిటీలోని అపార్ట్మెంట్లు తగలబడుతున్నాయ్ : ఘజియాబాద్లో అతిపెద్ద ఫైర్ యాక్సిడెంట్

గేటెడ్ కమ్యూనిటీలోని అపార్ట్మెంట్లు తగలబడుతున్నాయ్ : ఘజియాబాద్లో అతిపెద్ద ఫైర్ యాక్సిడెంట్

ఢిల్లీ నేషనల్ క్యాపిటర్ రీజియన్ లోని ఘజియాబాద్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గేటెడ్ మ్యూనిటీలో ఒక ఫ్లోర్ లో మంటలు చెలరేగటంతో అపార్ముమెంట్ అంతా అంటుకోవడం భయభ్రాంతులకు గురిచేసింది. గౌర్ గ్రీన్ సొసైటీలోని టవర్-డీ లో చెలరేగిన మంటలు.. ఢిల్లీని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. గేటెడ్ కమ్యూనిటీలోని జనాల బయాందోళనలు, హాహాకారాల మధ్య సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

2026 ఏప్రిల్ 29వ తేదీ ఉదయం 8.30 ప్రాంతంలో 9వ ఫ్లోర్ లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత మిగతా ఫ్లోర్లకు అంటుకోవడంతో అపార్ట్మెంట్ వాసులు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మంటలు చాలా వేగంగా వ్యాపిస్తుండటంతో ఏడు ఫ్లోర్లు ప్రభావితమయ్యాయి. పైనున్న ఫ్లోర్లతో పాటు కింది ఫ్లోర్లకు కూడా మంటలు వ్యాపించాయి. అగ్ని మాపక సిబ్బంది రెండున్నర గంటలుగా ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రావటం లేదు.

ఉత్తరప్రదేశ్ లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదాల్లో ఇది చాలా పెద్ద ప్రమాదంగా చెబుతున్నారు. దావానలం అంటుకున్నట్లుగా మంటలు ఎగసిపడుతున్నాయి. పై అంతస్తులకు వెళ్లేందుకు  అగ్నిమాపక విభాగం హైడ్రాలిక్ పరికరాలను వినియోగిస్తున్నారు. అయినప్పటికీ భారీగా ఎగసిపడుతున్న మంటలకారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. టవర్ ముందు ఉన్న ఇరుకైన మార్గంలో, సొసైటీ పార్క్, ఎంట్రెన్స్ ఇరుకుగా ఉండటం కారణంగా.. కేవలం ఒకే వాహనం మాత్రమే వెళ్లగలదు. ఈ పరిస్థితుల్లో పెద్ద ఫైర్ టెండర్లు,  మెషీన్లు సంఘటనా స్థలానికి చేరుకోవడానికి కష్టంగా మారింది. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు చెబుతున్నారు. మంటలు విస్తరిస్తుండటంతో అన్ని అపార్ట్మెంట్లలో జనాలను ఖాళీ చేయించారు. 

ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్పాట్ కు వెళ్లి వీలైనంత త్వరగా మంటలు కట్టడి చేయాలని.. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.