కరోనా వైరస్ ను అరికట్టేందుకు లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నాయి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే లాక్ డౌన్ ఎఫెక్ట్ ప్రపంచంలోని అన్ని మతాల పవిత్ర స్థలాలపై పడింది. దీంతో వాటి ఆదాయాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ క్రమంలో ప్రతిరోజు వేలాది మందితో నిత్యం కిటకిటలాడే తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కరోనా కారణంగా భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. టికెట్లు, హుండి, వసతి గదులు, ప్రసాదం, తలనీలాలు, షాపులతో వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోయింది. దీంతో TTD 2020-21 బడ్జెట్ అంచనాలు మారిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం లాక్‌డౌన్ కొనసాగుతుండడంతో భక్తులను ఎవరిని అనుమతించడంలేదు. లాక్‌డౌన్ మరిన్ని రోజులు ఇలాగే కొనసాగితే TTD ఆదాయం మరింత భారీగా తగ్గిపోనుందంటున్నారు ఆలయాధికారులు.
