మాస్టర్ కార్తికేయ వరల్డ్ రికార్డ్

మాస్టర్ కార్తికేయ వరల్డ్ రికార్డ్

బషీర్ బాగ్, వెలుగు:  తన అద్భుత జ్ఞాపక శక్తితో  రెండు సంవత్సరాల ఎనిమిది నెలల మాస్టర్ బి.షంశ్రీతాన్ష్ కార్తికేయ అందరినీ అబ్బుర పరిచాడు. శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో భారత్ వరల్డ్ రికార్డ్స్ సీఈవో లయన్ కెవి రమణారావు, తెలంగాణ కో–-ఆర్డినేటర్ సుచరిత సుందరిరాజన్ ఆధ్వర్యంలో మాస్టర్​ కార్తికేయకు రికార్డులను అందజేశారు. 90 రకాల కార్ల లోగోలను చూసి బ్రాండ్ పేర్లను చెప్తూ, బ్రాండ్ పేర్లను చెపితే లోగోలను చూపిస్తూ, ఏ నుంచి జెడ్ వరకు కార్ల బ్రాండ్ల పేర్లు చెప్పడమే కాకుండా ఏ టు జెడ్ ఏ ఆల్ఫాబెట్ అడిగినా ఆ ఆల్ఫాబెట్ తో వచ్చే కారు బ్రాండ్ పేర్లు చెబుతోంది.

తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ రాములు, బీసీ కమిషన్ మెంబర్ వకులాభారణం కృష్ణమోహన్, భారత్ వరల్డ్ రికార్డ్స్, తెలుగు వరల్డ్ రికార్డ్స్, తెలంగాణ వరల్డ్ రికార్డ్స్, టాలెంట్ బుక్ ఆప్ రికార్డ్స్, అమేజింగ్ కిడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తదితర ఆరు ప్రపంచ రికార్డ్స్ లో నమోదు చేసిన ధ్రువపత్రాన్ని మాస్టర్ కార్తికేయకు తన తల్లిదండ్రులు బీ. వంశీకృష్ణ, అనుపమ సమక్షంలో అందజేశారు.