V6 News

ఇంటర్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ ప్రభంజనం...స్టేట్ఫస్ట్ మార్క్స్ సాధించిన స్టూడెంట్స్

ఇంటర్ ఫలితాల్లో  మాస్టర్ మైండ్స్ ప్రభంజనం...స్టేట్ఫస్ట్ మార్క్స్ సాధించిన  స్టూడెంట్స్

హైదరాబాద్, వెలుగు: ఇటీవల విడుదలైన ఇంటర్​ఫలితాల్లో హైదరాబాద్​లోని మాస్టర్​మైండ్స్ స్టూడెంట్స్​ అద్భుత ప్రతిభ కనబరిచారు. ఫస్టియర్​ఎంఈసీ గ్రూప్​లో డి. వర్ష 496/500,  సెకండియర్ ఎంఈసీలో కె. గాయత్రి వర్ధిని 991/1000, ఆర్. సిరినిత్య 991/1000 మార్కులు సాధించి స్టేట్ టాపర్లుగా నిలిచారు. ​ ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎస్ వీఆర్, ఎస్ఎం వలీ, అకడమిక్​ ప్రిన్సిపాల్​ అంజనేయ రెడ్డి, అశోక్​కుమార్​ మంచి మార్కులు సాధించిన స్టూడెంట్స్​ను అభినందించారు. 

అనంతరం వారు మాట్లాడుతూ.. ఫస్టియర్​లో 490 పైగా, సెకండియర్​లో  980 పైగా మార్కులు సాధించిన స్టూడెంట్స్  50 మందికి పైగా ఉన్నారన్నారు. ఈ విద్యార్థులందరూ ఇంటర్​ ఎంఈసీతో పాటు సీఏ కోర్సు చదువుతున్నారని తెలిపారు. మాస్టర్​ మైండ్స్​విద్యా సంస్థల అత్యున్నత బోధనా విధానం, క్రమశిక్షణే స్టూడెంట్స్​విజయానికి కారణమని పేర్కొన్నారు.