నిజామాబాద్‌లో అధికార పార్టీ కార్పొరేటర్‌పై.. అదే పార్టీకి చెందిన మేయర్ అనుచరులు దాడి చేశారు. నగరంలోని 9వ డీవిజన్ కార్పొరేటర్ సాదు సాయివర్ధన్ ఇంటిపై మేయర్ అనుచరులు శనివారం తెల్లవారుజామున దాడిచేశారు. ఈ దాడిలో కార్పొరేటర్ సాయివర్ధన్, అతని తమ్ముడికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో 5వ టౌన్ పోలీస్‌స్టేషన్లో కేసు నమోదైంది. మేయర్ అనుచరులైన అయిదుగురు వ్యక్తులపై పోలీసులు నాన్‌బెయిలబుల్ కేసులు నమోదుచేశారు. అధికార పార్టీ నేతల మధ్య బయటపడిన అంతర్గత గొడవలతో పార్టీలో కలకలం మొదలైంది. సాయివర్ధన్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లో చేరారు. ఆ ఎన్నికల్లో సాయివర్దన్.. ప్రస్తుత మేయర్ భర్త దండు శేఖర్‌పై విజయం సాధించారు. అప్పటినుంచి ఇద్దరి మధ్య విబేధాలున్నాయి. ఆ తర్వాత సాయి టీఆర్ఎస్‌లో చేరినప్పటి నుంచి ఇద్దరి మద్య వర్గపోరు మరీ ఎక్కువైంది.
