హయత్ నగర్లో రోడ్డు ప్రమాదం.. ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి

హయత్ నగర్లో రోడ్డు ప్రమాదం.. ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి

హైదరాబాద్ హయత్ నగర్లో రోడ్డు ప్రమాదం జరిగింది.  హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ దగ్గర  రోడ్డు దాటుతుండగా ఓ యువతిని  అతి వేగంతో  వచ్చిన కారు ఢీ కొట్టింది.

 ఈ ఘటనలో ఐశ్వర్య అనే ఎంబిబిఎస్  ఫైనల్ ఇయర్ చదువుతోన్న   విద్యార్థిని మృతి చెందగా ఆమె తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు  చికిత్స కోసం  స్థానిక  ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే  అప్పటికే విద్యార్థిని  మృతి చెందినట్టు డాక్టర్  తెలిపారు.  విద్యార్థిని డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. 

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  గాయపడ్డ తండ్రిని మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని కుటుంబ సభ్యులు కన్నీరమున్నీరవుతున్నారు. కూతురు లేదన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రమాదంతో రోడ్డుపై కాసేపు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలో మీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.