- పెంపుడు పిల్లి విషయంలో గొడవ..
- ఎంబీబీఎస్ విద్యార్థిని సూసైడ్
- పిల్లిని పెంచొద్దన్న పేరెంట్స్
- ఎక్కడైనా వదిలేయమనడంతో మనస్తాపం
- హైదరాబాద్లోని అల్వాల్లో ఘటన
అల్వాల్ వెలుగు : పెంపుడు పిల్లి విషయంలో తలెత్తిన గొడవ కూతురి ప్రాణాలను బలికొంది. ఈ సంఘటన హైదరాబాద్ లోని అల్వాల్ లో శుక్రవారం జరిగింది. అల్వాల్ లోని రిసాలా బజార్ లో కుసుమలత, దేవదత్తం నివాసం ఉంటున్నారు. వారికి ఎంబీబీఎస్ చదువుతున్న కూతురు తుమ్మల ప్రిన్సి శ్రేష్ట (23) ఉంది. గత కొన్నాళ్లుగా శ్రేష్ట ఒక పిల్లిని పెంచుకుంటోంది.
ఈ విషయమై ఇంట్లో తల్లిదండ్రులకు, శ్రేష్టకు మధ్య గొడవ జరుగుతోంది. పిల్లిని ఎక్కడైనా వదిలిపెట్టాలని తల్లిదండ్రులు వారించడంతో శ్రేష్ట మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకొంది.
ఆమె పేరెంట్స్ తిరిగి వచ్చి చూసేసరికి మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
