‘బిచ్చగాడు’ చిత్రంతో తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ.. మరోసారి సేమ్ కాంబోను రిపీట్ చేస్తున్నాడు. ఆ చిత్రాన్ని రూపొందించిన శశి దర్శకత్వంలో శుక్రవారం మరో మూవీని అనౌన్స్ చేశాడు. ‘బిచ్చగాడు’ చిత్రంలోని హిట్ సాంగ్ ‘వంద దేవుళ్లే కలిసొచ్చినా’ పాటలోని లిరిక్స్‌ను స్ఫూర్తిగా తీసుకుని ‘వంద దేవుళ్లు’ టైటిల్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు.
ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మంచు విష్ణు సోషల్ మీడియా ద్వారా విడుదల చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. ఇందులో విజయ్ ఆంటోని మాసివ్ లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకున్నాడు. తన వెనుక హీరోయిన్ స్వసిక సీరియస్‌గా చూస్తున్న పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫ్యామిలీ బయోపిక్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలియజేశారు మేకర్స్. రామాంజనేయులు జవ్వాజి సమర్పణలో ఫాతిమా విజయ్ ఆంటోనీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలాజీ శ్రీరామ్ సంగీతం అందిస్తున్నాడు.
Thank you Vishnu brother 😊 https://t.co/k7SWMaIQeA
— vijayantony (@vijayantony) March 20, 2026
