రంజాన్ రోజు ఇరాన్ షాక్ : డియోగో గార్సియా టార్గెట్ గా మిస్సైల్స్ : బిత్తరపోయిన అమెరికా, ఇజ్రాయెల్

రంజాన్ రోజు ఇరాన్ షాక్ : డియోగో గార్సియా టార్గెట్ గా మిస్సైల్స్ : బిత్తరపోయిన అమెరికా, ఇజ్రాయెల్

రంజాన్ పండుగ రోజు ఇరాన్ షాక్ ఇచ్చింది. ప్రపంచం నివ్వెరపోయే విధంగా అవాక్కయ్యింది. యుద్ధం మూడో వారంలోకి వచ్చేసింది. సరిగ్గా ఈ సమయంలోనే.. ఎవరూ ఊహించని విధంగా ఇరాన్ ప్రయోగించిన మిస్సైల్స్.. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలను బిత్తరపోయే విధంగా చేశాయి. ఇరాన్ ప్రయోగించిన ఈ మిస్సైల్స్ ఏంటీ.. ఎందుకు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతోపాటు ఇతర దేశాలు భయపడుతున్నాయి అనేది పూర్తిగా తెలుసుకుందామా..

డియోగో గార్సియో సైనిక స్థావరం ఏంటీ..?

డియోగో గార్సియో అనేది హిందూ మహా సముద్రంలోని ఓ ద్వీపం. ఇది అమెరికా, బ్రిటన్ దేశాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న సైనిక స్థావరం. డియోగో గార్సియో సైనిక స్థావరం నుంచి ఈ రెండు దేశాలకు చెందిన సైనిక శక్తి మోహరించి ఉంటుంది. ఇది ఇరాన్ దేశానికి 4 వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 

ఇరాన్ ప్రయోగించిన మిస్సైల్స్ ఏంటీ..?

2026, మార్చి 21వ తేదీ తెల్లవారుజామున ఇరాన్ రెండు మిస్సైల్స్ ప్రయోగించింది. ఈ మిస్సైల్స్ పేరు ఖొర్రంషహర్. వీటిలో 1, 2, 3, 4 రకాలు ఉన్నాయి. వీటి రేంజ్ 2 వేల కిలోమీటర్లు మాత్రమే అనేది అమెరికా దగ్గర ఉన్న సమాచారం. ఇలాంటి ఖొర్రంషహర్ మిస్సైల్స్ రెండింటిని ప్రయోగించింది ఇరాన్. వీటి టార్గెట్ డియోగో గార్సియో సైనిక స్థావరం. ఇరాన్ చర్యతో అమెరికా, ఇజ్రాయెల్ షాక్ అయ్యాయి. 4 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని టార్గెట్ చేయటం అంటే.. అది కూడా 4 వేల కిలోమీటర్ల దూరంలోని ఆర్మీ బేస్ లక్ష్యంగా చేసుకోవటం అంటే.. ఇరాన్ దగ్గర 4 వేల కిలోమీటర్ల రేంజ్ మిస్సైల్స్ ఉన్నట్లే కదా అనే అంచనాకు వస్తున్నాయి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు. ఇప్పటి వరకు వాళ్ల అంచనాలకు భిన్నంగా.. ఇరాన్ చర్య ఉండటంతో అందరూ షాక్ అవుతున్నారు.

ఇరాన్ మిస్సైల్స్ టార్గెట్ రీచ్ అయ్యాయా..?

ఇరాన్ ప్రయోగించిన ఖొర్రంషహర్ మిస్సైల్స్ ను మధ్యలోనే కూల్చేశాయి అమెరికా, ఇజ్రాయెల్ దళాలు. ఇరాన్ ప్రయోగించిన క్షిపణి ఒకటి మధ్యలోనే ఫెయిల్ అయ్యింది. మరో క్షిపణిని అమెరికా నౌకాదళం కూల్చేసింది. ఇరాన్ ప్రయోగించిన ఈ మిస్సైల్స్ మధ్యలోనే కూల్చేయటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇరాన్ దగ్గర 4 వేల కిలోమీటర్ల రేంజ్ మిస్సైల్స్ ఉన్నాయా అనేది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

యూరప్ దేశాలన్నీ ఇరాన్ టార్గెట్ చేస్తుందా..?

ఇరాన్ దగ్గర ఉన్న ఖొర్రంషహర్ మిస్సైల్స్ పరిధిలోకి ఇప్పుడు యూరప్ దేశాలన్నీ వస్తున్నాయి. ఇరాన్ నుంచి 3 వేల కిలోమీటర్ల పరిధిలోనే లండన్, పారిస్ తోపాటు యూరప్ దేశాల్లోని చాలా దేశాలు ఇప్పుడు ఇరాన్ మిస్సైల్స్ పరిధిలోకి వస్తాయని ఆందోళన చెందుతున్నాయి ఆయా దేశాలు. ఇరాన్ ఇప్పుడు ప్రయోగించిన ఈ మిస్సైల్స్ టెక్నాలజీ ఉత్తరకొరియా, రష్యా నుంచి తీసుకున్నట్లు అంచనా వేస్తున్నారు. ఆ రెండు దేశాల సహకారంతోనే ఇరాన్ ఈ మిస్సైల్స్ తయారు చేసి ఉంటుందని భావిస్తున్నాయి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు.

డియోగో గార్సియో సైనిక స్థావరం ప్రత్యేకత ఏంటీ..?

అమెరికా, బ్రిటన్ దేశాలకు ఇది చాలా ముఖ్యమైన ఆర్మీ బేస్. ఇక్కడి నుంచి ఆఫ్గనిస్తాన్, ఇరాక్ దేశాలపై యుద్ధం చేసింది. ఆసియా, ఆఫ్రికా, గల్ఫ్ దేశాలను మోహరించాలంటే.. ఆయా దేశాలపై దాడులు చేయాలన్నా అమెరికాకు ఈ సైనిక స్థావరం అనేది అత్యంత కీలకం. ఇక్కడ వందల కొద్ది యుద్ధ విమానాలు, బాంబులు నిల్వ ఉంటాయి. ఈ సైనిక స్థావరం నుంచి రెండు ఖండాలను ఈజీగా టార్గెట్ చేయటానికి.. అమెరికాకు అనువైన ప్రాంతం. ఇలాంటి సైనిక స్థావరాన్ని ఇరాన్ లక్ష్యంగా చేసుకోవటం అంటే మామూలు విషయం కాదంటున్నారు అంతర్జాతీయ యుద్ధ నిపుణులు. 

డియోగో గార్సియా సైనిక స్థావరం గురించి ఇరాన్ దేశానికి అంతా తెలుసు అని.. బాగా అవగాహన ఉండబట్టే ఇలాంటి నిర్ణయం తీసుకున్నదని.. గార్సియో ఆర్మీ బేస్ గా ఇరాన్ దాడులను పెంచితే మాత్రం.. యూరప్ మొత్తం యుద్ధంలోకి దిగే అవకాశాలు లేకపోలేదనే అంచనాలు వినిపిస్తున్నాయి.