Dethadi Glimps: హైదరాబాదీ టచ్‌తో ఆశిష్ ‘దేత్తడి’.. 500 మంది డ్రమ్మర్స్‌తో గ్లింప్స్ గ్రాండ్ రిలీజ్

Dethadi Glimps: హైదరాబాదీ టచ్‌తో ఆశిష్ ‘దేత్తడి’.. 500 మంది డ్రమ్మర్స్‌తో గ్లింప్స్ గ్రాండ్ రిలీజ్

రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో హీరోగా ఆకట్టుకున్న ఆశిష్‌‌.. త్వరలో ‘దేత్తడి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. దిల్ రాజు,  శిరీష్‌‌ నిర్మిస్తున్న ఈ చిత్రంతో ఆదిత్య రావు గంగసాని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శుక్రవారం ఈ మూవీ నుంచి అప్‌‌డేట్‌‌ ఇచ్చారు మేకర్స్‌‌.

మార్చి 24న వీడియో గ్లింప్స్‌‌ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ  సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌ ఆకట్టుకుంది. ఇందులో హై ఎమోషన్‌‌తో పాటు హైదరాబాద్‌‌ కల్చర్‌‌‌‌ను కొత్తగా ప్రజెంట్‌‌ చేయబోతున్నామని మేకర్స్‌‌ తెలియజేశారు.

అంతేకాదు.. టీజర్ రిలీజ్ సందర్భంగా 500 మందికి పైగా హైదరాబాదీ స్ట్రీట్ డ్రమ్మింగ్ కళాకారులు ప్రత్యక్ష ప్రదర్శన ఇవ్వనున్నారు. మార్చి 24న సాయంత్రం 6 గంటల నుండి పీపుల్స్ ప్లాజాలో వద్ద భారీ స్థాయిలో హైదరాబాదీ స్ట్రీట్ డ్రమ్మింగ్ ప్రదర్శన జరగనుంది.తాజాగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. 

ఆశిష్‌‌ మాస్‌‌ లుక్‌‌లో కనిపించడమే కాకుండా, హైదరాబాదీ స్లాంగ్‌‌లో డైలాగ్స్‌‌ చెప్పబోతున్నాడు. జునైద్ కుమార్ దీనికి సంగీతం అందిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ స్క్రీన్‌‌ప్లే, డైలాగ్స్‌‌తో పాటు క్రియేటివ్ హెడ్‌‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది.