ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) మేనేజ్ మెంట్ ట్రైనీ (ఎంటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 59 (మేనేజ్మెంట్ ట్రైనీ).
విభాగాల వారీగా ఖాళీలు: కెమికల్ 7, మెకానికల్ 24, సివిల్ 21, ఎలక్ట్రికల్ 7.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కెమికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో కనీసం 65 శాతం మార్కులు లేదా సమాన సీజీపీఏతో బి.టెక్/ బీఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 2025, 2026 సంవత్సరాల్లో ఇంజినీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులు మాత్రమే అప్లై చేయడానికి అర్హులు. 2024 లేదా అంతకంటే ముందు ఇంజినీరింగ్ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు కాదు.
అభ్యర్థులు తప్పనిసరిగా గేట్– 2026 (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్) పరీక్షకు హాజరై ఉండాలి. దరఖాస్తు చేసుకున్న పోస్టుకు వర్తించే సంబంధిత ఇంజినీరింగ్ విభాగం పేపర్ (సీహెచ్/ ఎంఈ/ సీఈ/ ఈఈ)లో ఉత్తీర్ణులై ఉండాలి. గేట్– 2024 లేదా గేట్– 2025 పరీక్షలకు హాజరై, గేట్ –2026కు హాజరుకాని అభ్యర్థులు అర్హులు కారు.
గరిష్ట వయోపరిమితి (2026, జులై 1 నాటికి): 25 ఏండ్లు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మార్చి 20.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 13.
సెలెక్షన్ ప్రాసెస్: గేట్–2026 స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ అనంతరం ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్ సైట్ recruitment.eil.co.inను సందర్శించండి.
