పీసీసీ మైనార్టీ సెల్ చైర్ పర్సన్ గా ఎండీ ఇర్ఫాన్ అలీ

పీసీసీ మైనార్టీ సెల్ చైర్ పర్సన్ గా ఎండీ ఇర్ఫాన్ అలీ
  • ప్రకటించిన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ( పీసీసీ) మైనార్టీ సెల్ చైర్ పర్సన్​గా ఎండీ ఇర్ఫాన్ అలీని హైకమాండ్ నియమించింది. ఈ మేరకు బుధవారం రాత్రి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు.

పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో తెలంగాణతో పాటు ఉత్తరాఖండ్ పీసీసీ చైర్ పర్సన్ ల నియామకాలు చేపట్టినట్టు తెలిపారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. అయితే, ఉత్తరాఖండ్ పీసీసీ చైర్ పర్సన్ గా హజి సులేమాన్ అన్సారీని అధిష్టానం నియమించింది.