అఫ్గాన్ నుంచి 550 మందిని తీసుకొచ్చాం

అఫ్గాన్ నుంచి 550 మందిని తీసుకొచ్చాం

ఆఫ్గనిస్తాన్ నుంచి ఇప్పటి వరకు 550 మందిని దేశానికి తీసుకొచ్చినట్టు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బగ్చి చెప్పారు. ఇందులో 260 మంది భారతీయులు ఉన్నారన్నారు. ఆఫ్గాన్ నుంచి వెనక్కి రావాలనుకున్న ఇండియన్స్ దాదాపు.. వచ్చేశారని.. ఇంకా ఎవరైనా ఉంటే తీసుకొచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆఫ్గనిస్తాన్ లో ప్రస్తుతం గందరగోళ పరిస్థితి ఉందని.. ప్రభుత్వ ఏర్పాటుపైనా ఇప్పటి వరకు క్లారిటీ రాలేదన్నారు. ప్రజల భద్రత ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తంచేశారు.