మెదక్ జిల్లాలో టెన్త్‌‌‌‌ లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు విహారయాత్ర

మెదక్ జిల్లాలో టెన్త్‌‌‌‌  లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు విహారయాత్ర

మెదక్​ టౌన్, వెలుగు: మెదక్​ జిల్లాలో టెన్త్‌‌‌‌ లో 560కి పైగా మార్కులు వచ్చిన 70 మంది విద్యార్థులను కలెక్టర్​ ప్రతిమాసింగ్​అభినందిస్తూ వారిని రామోజీ ఫిలిం సిటీ సందర్శనకు మంగళవారం కలెక్టరేట్​నుంచి బస్సుల్లో పంపించారు. 

ప్రభుత్వ స్కూల్‌‌‌‌లో చదివే విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తే విహారయాత్రకు పంపిస్తామని పరీక్షల సమయంలో మాట ఇచ్చారు. దీంతో మంచి మార్కులు సాధించిన 70 మంది విద్యార్థులను పంపించారు.