కౌడిపల్లి, వెలుగు : గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఈ ప్రమాదం మెదక్ జిల్లా కౌడిపల్లి శివారులోని బట్టెమ్మ గుడి వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన చంద్రకాంత్ (36) ఆదివారం తన ఫ్రెండ్, నందికంటి గ్రామానికి చెందిన అభిషేక్ (35)తో కలిసి బైక్‌పై మెదక్‌లో ఉంటున్న తన చెల్లెలు వద్దకు బయలుదేరాడు. మార్గమధ్యలో కౌడిపల్లి దాటిన తర్వాత బట్టమ్మ గుడి వద్దకు రాగానే వీరిబైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.
అభిషేక్ అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ చంద్రకాంత్‌ను పోలీసులు 108లో నర్సాపూర్ హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు కౌడిపల్లి ఎస్సై అమరేందర్ తెలిపారు.
