శివ్వంపేట, వెలుగు: మెదక్ లైబ్రరీ చైర్పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి సోమవారం సెక్రటేరియట్లో జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని కలిశారు. నర్సాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ప్రత్యేక నిధులు ఇవ్వాలని, జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్టు ఆమె తెలిపారు. ఆమె వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్ ఉన్నారు.

