- మంత్రి పొన్నం ప్రభాకర్
మేడ్చల్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం గ్రామాల వారీగా సర్వే నిర్వహించి విద్యా వ్యవస్థను బలోపేతం చేయనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని జక్కుల నర్సింహా రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో గోశాల, ఐటీ బ్లాక్ ను స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజంలో విద్యనే పెద్ద ఆస్తి అన్నారు. బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. కాలేజీ యాజమాన్యం, స్టాఫ్ పాల్గొన్నారు.
