ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే మందులను అమ్మకుంటున్నరు.. రూ. 2 లక్షల మందులు సీజ్

ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే మందులను అమ్మకుంటున్నరు.. రూ. 2 లక్షల మందులు సీజ్

పేద, సామాన్య ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఉచితంగా మందులను సరఫరా చేస్తోంది. అదే అదునుగా తీసుకొని కొందరు అక్రమార్కులు క్యాష్ చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న మందులను అక్రమంగా అమ్ముకుంటున్నారు. ఈ ఘటన సికింద్రాబాద్ లో చోటు చేసుకుంది. 

నార్కోటిక్ డ్రగ్ కంట్రోలర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వం అందించే ఉచిత మందులను అక్రమంగా అమ్ముతున్న హెల్త్ ఫస్ట్ మెడికల్ షాప్ మెడికల్ షాపును ముసివేశామని తెలిపారు. ఈ షాపులో దాదాపు రెండు లక్షల విలువగల అక్రమ మందులను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.

సికింద్రాబాద్ లోని వారసిగూడ హెల్త్ ఫస్ట్ మెడికల్ షాప్ లో నార్కోటిక్ డ్రగ్ కంట్రోలర్ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే మందులను అక్రమంగా మెడికల్ షాపుల్లో నిలువ చేసి.. అమ్ముతున్నట్లుగా గుర్తించామని డ్రగ్ కంట్రోలర్ అధికారి గోవింద్ తెలిపారు. ఈ షాపులో దాదాపు రెండు లక్షల విలువైన మందులను నిల్వ చేసి.. విక్రయిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 

అయితే ఈ మందులను ఎక్కడ నుండి తీసుకొస్తున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్రమ డ్రగ్ రహిత తెలంగాణ సాధించడమే లక్ష్యంగా తాము దాడులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.