కాపాడమంటూ డయల్ 100కు చిన్నారి ఫోన్..

కాపాడమంటూ డయల్ 100కు చిన్నారి ఫోన్..

ఏదైనా సమస్య ఉన్నా.. ఆపదలో ఉన్న వారు డయల్100కు ఫోన్ చేసి సహాయం అడుగుతుంటారు. క్షణాల్లో వారికి పోలీసులు హెల్ప్ చేస్తుంటారు. కొందరేమో ఎవరైనా గొడవ పడుతుంటే మనకెందుకులే అని  అనుకుంటారు. మరికొందరు మాత్రం డయల్ 100కి ఫోన్ చేసి సమాచారాన్ని అందిస్తుంటారు. ఓ చిన్నారి ఇలాగే డయల్ 100కి ఫోన్  చేసి సార్.. మా ఏరియాలో కొంతమంది కొట్లాడుతున్నరు.. కాపాడాలని ఫోన్ చేసి చెప్పింది. ఈ ఘటన మీర్ పేటలో చోటు చేసుకుంది. 

మీర్ పేటలోని ప్రశాంతిహిల్స్ లో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఇంట్లో ఉండే ఏడేళ్ల చిన్నారి అమీక్ష సెకండ్ క్లాస్ చదువుతోంది. కాలనీలో ఓ భవనం నిర్మాణం జరుగుతోంది. అక్కడ కూలీలు గొడవపడుతుండటాన్ని అమీక్ష చూసింది. వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి కాపాడమని కోరింది. స్పందించిన పోలీసులు 10 నిమిషాల్లో అక్కడికి చేరుకున్నారు. కొట్లాడుతున్న ఇరువర్గాలను సముదాయించారు.