ఆదిపురుష్లో హనుమాన్గా నటించింది ఎవరంటే..

ఆదిపురుష్లో హనుమాన్గా నటించింది ఎవరంటే..

హీరో ప్రభాస్ నటించిన ‘ఆది పురుష్’ సినిమాలోని ఓ పాత్రపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతిస‌న‌న్, రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్  నటించగా.. హనుమంతుడి పాత్రలో ఎవరు నటించారు ? అనేది తెలుసుకోవాలనే కుతూహలం సినీ అభిమానుల్లో నెలకొంది. ఇక ఇప్పటివరకు కేవ‌లం ప్రధాన పాత్రలను మాత్రమే ప‌రిచ‌యం చేసిన డైరెక్టర్ ఓంరౌత్ హ‌నుమంతుడి పాత్రలో ఎవరు న‌టిస్తున్నార‌నేది ప్రకటించలేదు. దీంతో ఆ రోల్ ప్లే చేసింది ఎవరనే దానిపై ఉత్కంఠ మరింత పెరిగింది. హ‌నుమంతుడి పాత్రలో నటించిన అతడి పేరు దేవ‌ద‌త్త గ‌జాస‌న్ నాగే.

మ‌రాఠీ సీరియ‌ల్స్, సినిమాలతో పేరు..

ఇంతకుముందు వరకు మ‌రాఠీ సీరియ‌ల్స్, సినిమాల్లో న‌టించి దేవదత్త మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జై మల్హర్ సీరియల్ లో కండోబా పాత్రలో నటించి ప్రేక్షకులకు చేరువయ్యాడు. వీర్ శివాజీ, దేవ‌యాని, బాజీరావ్ మ‌స్తానీ వంటి మూవీల్లోనూ న‌టించాడు. గతంలో డైరెక్టర్ ఓంరౌత్ తెర‌కెక్కించిన తాన్హాజీ, ది అన్ సంగ్ వారియ‌ర్ మూవీలో సూర్యాజీ మ‌లుస‌రే పాత్రలో యాక్ట్ చేశాడు.

నాకు హ‌నుమంతుడితో ప్రత్యేక అనుబంధం

‘‘నాకు హ‌నుమంతుడితో ప్రత్యేక అనుబంధం ఉంది.17 ఏళ్ల వ‌య‌సులోనే నేను వ‌ర్క్ అవుట్ చేయ‌డం ప్రారంభించాను. నా మొదటి జిమ్ సెంట‌ర్‌కి హ‌నుమాన్ వ్యాయామశాల అని పేరు పెట్టాను. ఆదిపురుష్ మూవీలో హనుమంతుడిగా నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఆ పాత్రలో నటించేందుకు నా శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నాను’’  అని దేవ‌ద‌త్త గ‌జాస‌న్ నాగే ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.