MegaStar: చిరు - బాబీ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ .. ఈసారి బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే!

MegaStar: చిరు - బాబీ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ .. ఈసారి బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన కెరీర్ లో అత్యంత స్వర్ణయుగ్గాన్ని ఆస్వాదిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. సంక్రాంతికి ' మన శంకర వరప్రసాద్ గారు' మూవీ విడుదలకు రెడీ అవుంతోంది. ఈ తర్వాత ముఖ్యంగా 'వాల్తేరు వీరయ్య' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత దర్శకుడు బాబీ కొల్లితో చిరు మళ్లీ జతకడుతుండటం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం 'Mega158' (వర్కింగ్ టైటిల్)  సినిమా గురించి లేటెస్ట్ గా కొన్ని సెన్సేషనల్ అప్‌డేట్స్ బయటకు వచ్చాయి. 

మలయాళ సూపర్ స్టార్‌తో మెగాస్టార్ కలయిక!

చిరు-బాబీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఈ బారీ ప్రాజెక్ట్‌పై అంచనాలు పెరగడానికి ప్రధాన కారణం ఇందులో మలయాళ దిగ్గజ నటుడు మోహన్‌లాల్ నటిస్తున్నారని తెలుస్తోంది.  సినీ వర్గాల సమాచారం ప్రకారం.. మోహన్‌లాల్ ఈ సినిమాలో అత్యంత కీలకమైన , పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే, భారతీయ చిత్ర పరిశ్రమలోని ఇద్దరు లెజెండరీ నటులు తొలిసారి ఒకే స్క్రీన్‌పై కనిపించడం అభిమానులకు కన్నుల పండుగే అని చెప్పాలి.

క్రేజీ కాస్టింగ్, కథా నేపథ్యం

ఈ సినిమా ఒక రస్టిక్ మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన ఇతర ఆసక్తికర అంశాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి ఒక బాధ్యతాయుతమైన తండ్రి పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఆయన కూతురి పాత్ర కోసం ఒక యంగ్ అప్‌కమింగ్ హీరోయిన్‌ను ఎంపిక చేసే పనిలో ఉన్నారు బాబీ. అంతే కాదు బాలీవుడ్ విలక్షణ దర్శకుడు ,  నటుడు అనురాగ్ కశ్యప్ కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది . ఈ సినిమా కోసం బాబీ ఈసారి తన రెగ్యులర్ టీమ్‌ను కాకుండా కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్నారు. 'లక్కీ భాస్కర్' ఫేమ్ నిమిష్ రవి సినిమాటోగ్రాఫర్‌గా, అలాగే ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఈ చిత్రానికి పని చేయబోతున్నారు.

►ALSO READ | Shivaji vs Chinmayi : టాలీవుడ్‌లో డ్రెస్సింగ్ వార్: శివాజీ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన చిన్మయి, అనసూయ!

వరుసగా మూడు సినిమాలు

చిరంజీవి ప్రస్తుతం మూడు భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు.  వశిష్ట దర్శకత్వంలో వస్తున్న సోషియో-ఫాంటసీ చిత్రం 'విశ్వంభర' ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. గ్రాఫిక్స్ పనుల వల్ల ఇది 2026లో విడుదల కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న  యాక్షన్ కామెడీ చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు'  2026 సంక్రాంతికి (జనవరి 12l ) విడుదల కాబోతోంది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో కూడా చిరు ఒక ఊరమాస్ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టారు.

మోహన్‌లాల్ బిజీ షెడ్యూల్

మరోవైపు మోహన్‌లాల్ కూడా 'వృషభ' (డిసెంబర్ 25, 2025 విడుదల), 'దృశ్యం 3', 'జైలర్ 2' వంటి భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ బిజీ షెడ్యూల్ మధ్య చిరంజీవి సినిమాకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సినిమా వెయిటేజీని పెంచింది. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్లనుంది. 'వాల్తేరు వీరయ్య'తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ కాంబో, మోహన్‌లాల్ తోడవ్వడంతో మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.