మెహబూబా ముఫ్తీ గృహ నిర్బంధం పొడగింపు

మెహబూబా ముఫ్తీ గృహ నిర్బంధం పొడగింపు

జమ్ము కశ్మీర్‌ మాజీ  సీఎం మెహబూబా ముఫ్తీ గృహనిర్బంధాన్ని మరో మూడు నెలలు పొడగించింది ప్రభుత్వం. ప్రజా భద్రత చట్టం (PNA) కింద గతేడాది ఆగస్టు 5 నుంచి ఆమె అధికారిక నివాసం ఫెయిర్‌ వ్యూలో నిర్బంధంలో ఉన్నారు. చివరిసారిగా మే నెలలో నిర్బంధాన్ని ప్రభుత్వం పొడిగించింది. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు చేసిన రోజునుంచి మెహబూబా ముఫ్తీతో పాటు, ఒమర్‌ అబ్దుల్లాను కూడా ప్రభుత్వం నిర్బంధంలో ఉంచింది. మొదటి ముఫ్తీని చష్మాషాహిలోని ప్రభుత్వ అతిథిగృహంలో ఉంచారు. ప్రభుత్వమే అన్ని సౌకర్యాలు కల్పించింది. అయితే ఏప్రిల్‌ 7న సొంత ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. అప్పటి నుంచి అక్కడే నిర్బంధంలో ఉంటున్నారు ముఫ్తీ.