- రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్, హరీశ్ రావు మతిలేని మాటలను మాట్లాడటం ఆపేయాలని రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి హెచ్చరించారు. శనివారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్న సీఎం రేవంత్‌పై అసత్యాలను ప్రచారం చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్న కేటీఆర్, హరీశ్‌కు త్వరలోనే తగిన బుద్ధి చెప్తామని వార్నింగ్ ఇచ్చారు.
ఇప్పటికైనా ఈ ఇద్దరు నేతలు సీఎం రేవంత్‌పై, కాంగ్రెస్ సర్కార్‌పై తప్పుడు ప్రచారం సాగించినట్లయితే తెలంగాణ సమాజమే వారిని ఈ రాష్ట్రం నుంచి బహిష్కరిస్తుందని హెచ్చరించారు. ఇంకా ఈ రాష్ట్ర ప్రజలు కేటీఆర్, హరీశ్ మాటలను నమ్మే స్థితిలో లేరని, పదేండ్లు నమ్మి మోసపోయిన తీరును తెలంగాణ ప్రజలు మరిచిపోలేదని మెట్టు సాయి స్పష్టం చేశారు.

