3 స్టాప్ లు 1700 మంది ప్రయాణికులు

3 స్టాప్ లు 1700 మంది ప్రయాణికులు
  • శ్రామిక్ రైళ్ల ప్రయాణానికి కొత్త గైడ్ లైన్స్

న్యూఢిల్లీ : మైగ్రెంట్ లేబర్స్ ను తరలించే శ్రామిక రైళ్ల విషయంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో రైళ్లో ఫిజికల్ డిస్టెన్స్ మెయింటెన్ చేసేందుకు ఇప్పటి వరకు 1200 మంది ప్రయాణికులకే అనుమతించిన రైల్వే ఇప్పుడు గైడ్ లైన్స్ మార్చింది. ఇక నుంచి ప్రతి రైళ్లో 1700 మంది ప్రయాణికులను అనుమతించాలని నిర్ణయించింది. అదే విధంగా ఒక్కో రైలు డెస్టినేషన్ కు చేరే వరకు మూడు చోట్ల ఆపాలని నిర్ణయించింది. పలు రాష్ట్రాల విజ్ఞప్తి మేరకే స్టాప్ లు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. స్లీపర్ బెర్త్ లు ఎన్ని ఉంటే అంతమందికి సీట్లు కేటాయించనున్నారు. ప్రస్తుతం ఒక్కో రైలు 24 కోచ్ లతో ప్రయాణిస్తోంది. ఇప్పటి వరకు 54 మంది ప్యాసింజర్లనే ఎక్కించుకున్నప్పటికీ ఇక నుంచి ఒక్కో కోచ్ 72 మంది మైగ్రెంట్ లేబర్స్ ను తరలించనున్నారు. మే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 5 లక్షల మంది మైగ్రెంట్ లేబర్స్ ను వారి స్వస్థలాలకు పంపించారు. త్వరలో మరింత ఎక్కువ మందిని తరిలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రాలు కూడా వీలైనంత వరకు మైగ్రెంట్ లేబర్స్ ను తరలించేందుకు ఉదారంగా వ్యవహారించాలని కేంద్రం కోరింది. అవసరమైతే మరిన్ని రైళ్లను పెంచుతామని చెప్పారు. మొన్న మహారాష్ట్రలో వలస కార్మికులను డ్స్ రైలు ఢీకొట్టి 16 మంది చనిపోయారు. దీంతో ఇక మైగ్రెంట్ లేబర్స్ కాలినడక వెళ్లకుండా బస్సులు, రైళ్లలోనే వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరింది.