బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారు : రాహుల్ గాంధీ

బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారు : రాహుల్ గాంధీ

బీజేపీ పార్టీపై విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. బీజేపీ పార్టీ నేతలు రాజ్యాంగాన్ని మార్చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అట్టడుగు వర్గాలకు రక్షణ రాజ్యాంగమని తెలిపారు.  రాజ్యాంగం రాయడం కంటే ముందు పేదలకు హక్కులు లేవని చెప్పారు. సామాన్యుల గొంతుక భారత రాజ్యాంగమని తెలిపారు. రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఎంతో శ్రమించి రాశారని తెలిపారు. కాంగ్రెస్ లక్ష్యం ఒక్కటే రాజ్యాంగాన్ని రక్షించడమేనని చెప్పారు. 

ఖర్గే, రేవంత్, తాను రాజ్యాంగాన్ని కాపాడాటం కోసం శ్రేమిస్తున్నామని తెలిపారు. ఈ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. దేశంలో పెట్టుబడి దారు వ్యవస్థను పెంచి పోశిస్తున్నారని చెప్పారు. 2 శాతం ఉన్న ధనవంతుల చేతిలో దేశ సంపద మొత్తం ఉందన్నారు.  దేశంలో 20 మంది బడా వ్యాపారుల కోసమే మోదీ పనిచేస్తున్నారని ఆరోపించారు.  

రిజర్వేషన్లు మార్చడం కోసమే సర్కార్ ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహిస్తుందని అన్నారు. దేశంలో బీజేపీ రాజ్యాంగాన్ని ఎత్తేయాలని చూస్తుంటే తాము 50 % పరిమితి ఎత్తివేయాలని చూస్తున్నామని అన్నారు.  ఏ శక్తి రాజ్యాంగాన్ని మార్చలేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలో కులగణన చేస్తామని తెలిపారు.  ఒక చారిత్రాత్మకమైన నిర్ణయానికి తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 

దేశంలోని నిరుపేదలు ఎంత మంది ఉన్నారో వారందరి పేరు మీద జాబితా తయారు చేయబడుతుందని అన్నారు.ప్రతి కుటుంబం నుంచి ఓ మహిళను ఎంపిక చేసి ఆమెకు రూ. లక్ష డిపాజిట్ చేస్తామని తెలిపారు. దేశంలోని ప్రతి మహిళ అకౌంట్ లో రూ. 8500 జమ చేయబడతాయని తెలిపారు. చదవు కోసం ఇంటి ఖర్చుల కోసం ఈ డబ్బు ఉపయోగపడుతుందని అన్నారు. ఒక్కదెబ్బతో దెశంలోని పేదరికాన్ని తరిమేసిన వాళ్లమౌతామని తెలిపారు.

 మోదీ కోట్ల మంది ఉవకులను నిరుద్యోగులను చేశారని ఆరోపించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి టీం ప్రజల కోసం పనిచేస్తుందని తెలిపారు. ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా అములు చేస్తామని చెప్పారు. పంద్రాగస్ట్ లోగా రైతు రుణమాఫీ చేస్తామని వెల్లడించారు రాహుల్ గాంధీ.