SRH vs LSG: బదోనీ బౌండరీ.. తట్టుకోలేక అరిచేసిన కావ్య మారన్

SRH vs LSG: బదోనీ బౌండరీ.. తట్టుకోలేక అరిచేసిన కావ్య మారన్

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గెలుపోటములు పక్కనపెడితే కావ్య మారన్ ఇచ్చే క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతాయి. గెలిస్తే ఓ రేంజ్ లో సెలెబ్రేషన్ చేసుకునే ఆమె.. ఓడిపోతే అంతే నిరాశకు గురవుతుంది. గత రెండేళ్లుగా అడపాదపా విజయాలతో సరిపెట్టుకున్న కావ్యమారన్.. ఈ సీజన్ లో మాత్రం కమ్మిన్స్ నాయకత్వంలో సంతోషంతో కళకళలాడిపోతుంది. తాజాగా నిన్న (మే 9) లక్నో సూపర్ జయింట్స్ పై విజయం సాధించడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

నిన్న లక్నోపై  సన్‌రైజర్స్‌ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత కావ్య మారన్ సంతోషంతో గంతులేసింది. అయితే ఇదే మ్యాచ్ లో కావ్య కోపంతో గట్టిగా అరిచేసింది. మొదట బ్యాటింగ్ చేస్తున్న లక్నో ఇన్నింగ్స్ 20 ఓవర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ చివరి ఓవర్ లో కమ్మిన్స్ వేసిన మొదటి బంతిని బదోని రివర్స్ స్వీప్ ఆడాడు. గ్యాప్ లో కొట్టడంతో అది కాస్త బౌండరీకి వెళ్ళింది.

అసలే పూరన్, బదోని వికెట్ తీయలేక తంటాలు పడుతున్న సన్ రైజర్స్.. ధారాళంగా పరుగులు సమర్పించుకుంటుంది. ఈ దశలో కావ్య మారన్ తన కోపాన్ని నియంత్రించుకోలేకపోయింది. పళ్ళు గట్టిగా కొరుకుతూ పట్టలేని కోపంతో గట్టిగా కేకలు పెట్టింది. కావ్య మారన్ ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటివరకు తన ముఖంలో ఎన్నో ఎక్స్‌ప్రెషన్స్‌ చూసినా.. ఇలాంటి భయంకరమైన లుక్ ఇప్పటివరకు చూడలేదని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.  

ఈ మ్యాచ్ విషయానికి వస్తే 166 పరుగుల లక్ష్యాన్ని 9.4 ఓవర్లకే  చేధించారు. అభిషేక్ శర్మ(75 నాటౌట్: 28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్ లు), ట్రావిస్ హెడ్(89 నాటౌట్: 30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్ లు) పరుగులు చేశారు. అంతకుముందు లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది.