మిలిటరీ సమాచారం పాకిస్తాన్‌‌కు లీక్‌‌

మిలిటరీ సమాచారం పాకిస్తాన్‌‌కు లీక్‌‌
  • జవాన్‌‌ను అదుపులోకి తీసుకున్న ఆర్మీ అధికారులు

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌‌ ఏజెంట్ల హనీట్రాప్‌‌లో చిక్కుకొని మన సైనిక సమాచారాన్ని లీక్‌‌ చేసిన సోల్జర్​ను అధికారులు అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్‌‌ బాగుండ జిల్లా కంచన్‌‌పూర్‌‌‌‌ గ్రామానికి చెందిన శాంతిమే రాణా జైపూర్‌‌‌‌లోని ఆర్టరీ యూనిట్‌‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. అధికారుల వివరాల ప్రకారం.. ‘‘పాక్​కు చెందిన మహిళా ఏజెంట్లు గుర్నౌర్‌‌‌‌ కౌర్‌‌‌‌ అలియాస్‌‌ అంకిత, నిషాలు జవాన్‌‌ రాణా నంబర్‌‌‌‌ను తెలుసుకొని, వాట్సాప్‌‌ ద్వారా పరిచయం పెంచుకున్నారు. చాటింగ్‌‌లు, ఆడియో, వీడియో కాల్స్‌‌ కూడా చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. వీరు తమను తాము షాజహాన్‌‌పూర్‌‌‌‌కు చెందిన వారిగా పరిచయం చేసుకున్నారు. మిలిటరీ ఇంజనీరింగ్‌‌, నర్సింగ్​ సర్వీసెస్‌‌లో పనిచేస్తున్నట్లు అంకిత, నిషా చెప్పారు. ఆ తర్వాత అతని నుంచి ఇంటెలిజెన్స్‌‌కు సంబంధించిన సమాచారాన్ని రాబట్టడం మొదలు పెట్టారు. ముఖ్యమైన డాక్యుమెంట్లు, ఫొటోగ్రాఫ్‌‌లు, వీడియోలు పంపాలని అడిగారు. సీక్రెట్‌‌ డాక్యుమెంట్ల వీడియోలను రాణా వారికి పంపాడు. ఇందుకు కొంత డబ్బు కూడా రాణా అకౌంట్‌‌లో వేశారు”అని పోలీసులు తెలిపారు.