మైండ్‌‌స్పేస్‌‌ చేతికి హైదరాబాద్ క్యూ–సిటీ

మైండ్‌‌స్పేస్‌‌ చేతికి హైదరాబాద్ క్యూ–సిటీ

న్యూఢిల్లీ: మైండ్‌‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్‌‌ హైదరాబాద్‌‌లో 8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం గల ఆఫీస్ కాంప్లెక్స్‌‌ను రూ.512 కోట్లకు కొనుగోలు చేసింది.  కంపెనీ మాక్ సాఫ్ట్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్‌‌లో  100 శాతం  ఈక్విటీ షేర్‌‌హోల్డింగ్‌‌ను సొంతం చేసుకున్నట్లు  గురువారం రెగ్యులేటరీ ఫైలింగ్‌‌లో తెలిపింది. ఇది హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌‌లో 8.1 లక్షల చదరపు అడుగుల క్యూ–-సిటీ కమర్షియల్ కాంప్లెక్స్‌‌ను నిర్వహిస్తోంది.  

మైండ్‌‌స్పేస్‌‌ బిజినెస్ పార్క్స్‌‌ రీట్ సీఈఓ రమేష్ నాయర్ మాట్లాడుతూ,  తమ మొదటి ఎక్స్‌‌టర్నల్  కొనుగోళ్లను పూర్తి చేశామని అన్నారు. హైదరాబాద్‌‌లో  350కి పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) ఉన్నాయని తెలిపారు. తాజా డీల్‌‌తో  మైండ్‌‌స్పేస్ పోర్ట్‌‌ఫోలియో 37.9 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంటుంది.