వర్షాలు పడ్డందుకు బాధపడుతున్న బీఆర్ఎస్ నేతలు : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ 

వర్షాలు పడ్డందుకు బాధపడుతున్న బీఆర్ఎస్ నేతలు : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ 

హైదరాబాద్, వెలుగు: ‘కరువు రావాలి.. కాంగ్రెస్ ఖతం కావాలి’ అని బీఆర్ఎస్ నేతలు కోరుకున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. శుక్రవారం సీఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడారు. వర్షాలు ఎందుకు వచ్చాయా.. అని బీఆర్ఎస్ నేతలు బాధపడుతున్నారని, ఇది ఎల్‌‌‌‌ నినో కరువు కాదని, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు అని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

హరీశ్ రావు ఇంజినీరు అవతారం ఎత్తి  నెల రోజుల సమయం ఇస్తే నీళ్లు ఎత్తిపోస్తానని మాట్లాడారన్నారు. ఎత్తిపొతలు లేకుండానే ఎల్లంపల్లికి నీళ్లు వచ్చాయని, మరి దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం డిజైన్  చేసిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వల్లనే ఇది సాధ్యమైందన్నారు.